80వ దశకంలో తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సెలబ్రిటీలు ప్రతీసారి గెట్ టు గెదర్ పార్టీ జరుపుకునే విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఈ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరుగనున్నాయి. శని, ఆదివారాల్లో ఈ వేడుక జరుగనుండగా..దక్షిణాదిన 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులంతా గెట్ టు గెదర్‌లో సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్, వెంకటేశ్, భాను చందర్, నరేశ్, సురేశ్, జయసుధ, రాధిక, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీష్రాఫ్, రెహమాన్, ప్రభు, శరత్‌కుమార్ ఇతర తారలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.