సుగంధద్రవ్యాల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. రాష్ట్రంలో పసుపు, మిర్చి, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, సొం టి, జిలకర వంటి సుగంధద్రవ్యాల సాగు, ఎగుమతులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఉద్యానశాఖ.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రైతులను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటికే పసుపు, మిరప పంట సాగులో తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం, వనరులు ఉం డటంతో... చిన్న, సన్నకారు రైతులను ఆకర్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ప్రణాళికలు రూపొందిస్తున్నా యి. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో రసాయనిక ఎరువులను వదిలి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నాయి. ప్రపంచంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నది. ఏటా దేశంలో పండించిన సుగంధద్రవ్యాల్లో 85 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా, మిగతా 15 శాతం (దాదాపు రూ.18 వేలకోట్ల విలువైన సుగంధద్రవ్యాలు) విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
సుగంధద్రవ్యాలపై ఉద్యానశాఖ దృష్టి