రాజ్యసభలో ఎస్‌పీజీ సవరణ బిల్లు

రాజ్యసభలో ఎస్‌పీజీ సవరణ బిల్లు


న్యూఢిల్లీ: స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. నవంబర్ 27న ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటుతో బిల్లు సభామోదం పొందిందిసవరించిన బిల్లు ప్రకారం ప్రధాన మంత్రి, ఆయనకు కేటాయించిన నివాసంలో నివసించే ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని, మాజీ ప్రధానులకు కూడా పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఐదేళ్ల వరకూ మాత్రమే వారి కేటాయించిన నివాసాల్లో ఎస్‌పీజీ భద్రత ఉంటుందని ఇటీవల బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. గాంధీ కుటుంబ సభ్యల సెక్యూరిటీలో మార్పులు చేయడం ఎంతమాత్రం రాజకీయ ప్రతీకారం కాదని, గతంలో కేవలం ఒకే కుటుంబానికి దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రొటక్షన్ యాక్ట్‌ను సవరించేందుకే బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఎస్పీజీ భద్రతపై సమయానుగుణంగా కేంద్రం సమీక్ష నిర్వహిస్తుందని, గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని ప్రొఫెషనల్ అసెసెమెంట్‌‍లో తేలడంతో భద్రతా ఏర్పాట్లలో మార్పులు చేశామని చెప్పారు. ఇటీవల సోనియాగాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రతను తొలగించి ఆ స్థానే జడ్ ప్రస్ కేటగిరి సెక్యూరిటీని హోం శాఖ కల్పించింది.